మంత్రిగానే ఈటల రాజేందర్‌ను గౌరవించారు
వ్యక్తి గత పనులపై బయటికి వెళ్తే అసత్య ప్రచారాలు చేయడం తగదు..
మంథని ప్రజాప్రతినిధులు
మంథని టౌన్, మే 6: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆరే పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌కు సుప్రీం అని, కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పా ర్టీ.. కే సీఆర్.. కేటీఆర్.. కవితల పట్ల తమ నాయకుడు ఎల్లప్పుడూ విధేయుడిగానే ఉంటారని మం థని నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. మంథనిలో పుట్ట మ ధూకర్ నివాసంలో గురువారం నియోజక వర్గ స్థాయి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు విలేకరులతో మాట్లాడారు. గత రెండ్రోజులుగా టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ చైర్మ న్ పుట్ట మధూకర్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. వ్యక్తిగత పనులపై బయటికి వెళ్లిన మధుపై కాంగ్రెస్, సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీ డియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సీఎం కేసీఆర్ పట్ల తమ నా యకుడు ఎల్లవేళలా విధేయుడిగా ఉంటారని చె ప్పారు. ఈటల రాజేందర్ విషయంలో అందరి మంత్రులతో ఉన్న విధంగానే పుట్ట మధూకర్ సన్నిహితంగా ఉన్నారని, ఆయన పార్టీకి దూరమైతే పుట్ట మధూకర్ కూడా ఈటలకు దూరంగానే ఉంటారన్నారు.
ఈటల ఎపిసోడ్‌ను అడ్డం పెట్టుకొని మంథని టీఆర్ఎస్లో చీలిక తెచ్చి లబ్ధి పొందాలని కొందరు కు ట్ర పన్నుతున్నారని, అ లాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఇక్కడ మంథని, ము త్తారం, రామగిరి మండలాల ఎంపీపీలు కొండ శంకర్, ఆరెల్లి దేవక్క, జక్కుల ముత్తయ్య, మంథ ని జడ్పీటీసీ తగరం సుమలత, మంథని, ము త్తారం, మహదేవపూర్ పీఏసీఎస్ చైర్మన్లు కొత్త శ్రీ నివాస్, గుజ్జుల రాజిరెడ్డి, తిరుపతి, కమాన్‌పూర్, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్లు పూదరి సత్యనారాయణగౌడ్, శ్రీరాంభట్ల సంతోషిణి, మండలాధ్యక్షులు తగరం శంకర్‌లాల్, పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, రైతు బంధు మండలాధ్యక్షుడు ఆకుల కిరణ్, మాజీ జడ్పీటీసీ గొనె శ్రీనివాస్‌రావు, కౌన్సిలర్లు వీకే. రవి, గర్రెపల్లి సత్యనారాయణ, కుర్రు లింగయ్య, టీఆర్ఎస్ నాయకులు శంకెసి రవీందర్, ఆరెల్లి కొమురయ్యగౌడ్, మేడగోని రాజమౌళిగౌడ్, వొల్లాల అశోక్ ఉన్నారు.