
జడ్చర్ల, నవంబర్ 5 : బాదేపల్లి పత్తి మార్కెట్‌యార్డు రోడ్డును శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యద ర్శి రఘునందన్‌రావు పరిశీలించారు. పత్తి మార్కెట్‌యార్డుతోపాటు రోడ్డు నిర్మాణానికి 2007లో విజయకుమార్ దా దాపు 20ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. దీంతో మార్కెట్, అరకిలోమీటర్కుపైగా 75 ఫీట్ల వెడల్పుతో సీసీరోడ్డు నిర్మించారు. అయితే ప్రధాన రహదారి నుంచి మా ర్కెట్‌కు వచ్చే రోడ్డు మలుపులు ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని 2014లో అప్పటి పాలకవర్గ సభ్యులు విజయకుమార్‌తో మాట్లాడి నేరుగా రోడ్డు వేసేందుకు భూమి ఇవ్వాలని అడిగారని, అం దుకు సంబంధించిన ఫైల్‌ను 2014లోనే అప్పటి పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసి మార్కెటింగ్ శాఖకు పంపారు. దీనిపై స్పందించి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావు మార్కెట్‌కు వెళ్లే రోడ్డును పరిశీలించారు. ప్ర స్తుతమున్న రోడ్డుతోపాటు నేరుగా మార్కెట్‌కు రావడానికి నిర్మించే రోడ్డు స్థలాన్ని కూడా పరిశీలించారు. అయితే పత్తి మార్కెట్‌కు భూమి ఇచ్చిన విజయకుమార్ మార్కెట్‌కు నే రుగా ఇచ్చే రోడ్డుతోపాటు మార్కెట్ యార్డులో ఉన్న ఎడమవైపుగల భూ మిని కొంత తమకు ఇవ్వాలని, దానికి బదులుగా కుడివైపుగల భూమి ఇస్తామని మార్కెటింగ్ శాఖ అధికారికి విజ్ఞ ప్తి చేశారు.
దీనిపై మార్కెటింగ్‌శాఖ, ఇంజినీరిం గ్ అధికారులతో ముఖ్యకార్యదర్శి ర ఘునందన్‌రావు చర్చించారు. అదేవిధంగా వ్యవసాయశాఖ అనుబంధ శా ఖల అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ శాంతాబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, వ్యవసాయశాఖ జేడీ సుచరిత, మా ర్కెటింగ్‌శాఖ అధికారులు సారిక, నవీన్, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఏడీఏ అనిల్‌కుమార్, ఏవో గోపినాథ్, ఏఈ వో గౌస్‌పాషా తదితరులు పాల్గొన్నారు.