
అదనపు కలెక్టర్ శ్రీహర్ష
గద్వాల, నవంబర్ 5 : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే షెడ్యూల్డ్ కులాల వారికి అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం వరం లాంటిదని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష కోరారు. శుక్రవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం పోస్టర్‌ను అదనపు కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మా ట్లాడుతూ మెడిసిన్, ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, సైన్స్, హ్యూమనిటీస్, సోషల్ స్టడీస్ లాంటి పీజీ కోర్సులు చేయాలనుకునే వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని చె ప్పారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.20లక్షల ఆర్థిక సాయం రెండు విడుతలగా ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు అందజేసిన వారికి మొదటి విడుత రూ.10లక్షలు, రెండో సెమిస్టర్ ఫలితాల ఆధారంగా రెండో విడుత రూ.10లక్షలు మంజూరు అవుతాయని తెలిపారు. వీసా ఫీజు కింద, విమాన ప్రయాణ చార్జీలకు రూ.50వేల వరకు ఈ పథకం ద్వారా పొందవచ్చని తెలిపారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలు, డిగ్రీలో కనీసం 60శాతం మార్కులు, జీఆర్ఈ, జీఎంఏటీ, టీవోఈఎఫ్ఎల్, ఐఈఎల్టీఎస్ అర్హత పరీక్షల్లో 60శాతం మార్కులు పొందిన వారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు telanganae pass. cgg.gov.in వెబ్సైట్లో నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చని లేదా దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో అందజేయాలన్నారు. పై అర్హత పరీక్షలకు పేరొందిన కోచింగ్ సెంటర్ల ద్వారా కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాల కోసం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కా ర్యాలయంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి శ్వేత పాల్గొన్నారు.
స్వయం ఉపాధి పొందాలి
గట్టు, నవంబర్ 5 : మహిళలు స్వయం ఉపాధి పొందాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష కోరారు. మండలంలోని గొర్లఖాన్‌దొడ్డిలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాజ్‌కుమార్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్‌కు సంబంధించిన శిక్షణా సరిఫికెట్లను ఆయన మహిళలకు ప్రదానం చేశారు. రాజ్‌కుమార్ సంస్థ మహిళలు, యువతులకు పలు రంగాల ద్వారా శిక్షణనివ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నిర్వాహకురాలు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.