
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, నవంబర్ 5 : ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీలోని 37వ వార్డుకు చెందిన బాలసాయికు వైద్యం కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ రూ.లక్ష ఎల్వోసీని బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ధరూర్ మండలంలోని ఈర్లబండ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌కు ఆపరేషన్ నిమిత్తం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.3లక్షల ఎల్వోసీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని వారికి మెరుగైన చికిత్స అందించడానికి సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కౌన్సిలర్ మురళి, నాయకులు లత్తిపురం వెంకట్రామిరెడ్డి, నర్సింహులు, దివాకర్‌రెడ్డి, నాగులుయాదవ్, కురమన్న, ధర్మనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్
గద్వాల నూతన మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న జానకీరాంసాగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో ప్రజలకు మంచి సేవలు అందించి ప్రజల ఆదరణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, కౌన్సిలర్లు మురళి, నరహరి శ్రీనివాసులు, నాయకుడు రిజ్వాన్ పాల్గొన్నారు.