
వీపనగండ్ల, నవంబర్ 5 : గంగమ్మ జాతరను పురస్కరించుకొని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర క్రి కెట్ టోర్నమెంట్‌ను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గు రువారం ప్రారంభించారు. టోర్నమెంట్లో మొత్తం 80 టీ ములు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా మండంలోని సంగినేనిపల్లిలో ఎంపీటీసీ ఇంద్రకంటి వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకాలను అందజేశారు. మహిళలకు కుట్టు మిషన్ నేర్చుకోవడం భవిష్యత్‌లో ఎం తో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిష్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి చక్కగా నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి, కొండూరు సర్పంచ్ గోపాల్, నాయకులు రఘునాథ్‌రెడ్డి, గంగిరెడ్డి, రజాక్, రవీందర్‌రెడ్డి, బస్వరాజ్‌గౌడ్, రజాక్, మౌలాలి, వెంకటస్వామి, స్వామి, రాంచంద్రారెడ్డి, మదన్మోహన్రావు, కృష్ణాప్రసాద్యాదవ్, బాలు యాదవ్, బీచుపల్లియాదవ్, నిర్వాహకులు శివరాజ్, క్రాంతి పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీలు..
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలను టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణగౌ డ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య గురువారం ప్రారంభించారు. టోర్నమెంట్లో మొత్తం 58 టీములు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కల్వరాల సర్పంచ్ రఘునాథ్‌రెడ్డి, సింగిల్ విం డో డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, నాయకులు బాల్ చందర్, సురేందర్‌రెడ్డి, నాయరాయణ, రాములు, శేఖర్ పాల్గొన్నారు.