
వనపర్తి, నవంబర్ 5 : ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథార్టీ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి, జిల్లా సెషన్స్ జడ్జి రేణుక యార తెలిపారు. శుక్రవా రం మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుం చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, మెడికల్, తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో ఉచిత న్యాయ సే వ అధికార సంస్థ సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. పేద ప్రజలు, ఒంటరి మహిళలు, నిరక్ష్యరాసులకు న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవ, సలహా అందుతుందని, వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దేశంలోని ప్రతి మహిళకు, ప్రతి ఎస్సీ, ఎస్టీలకు కార్మికులకు, దివ్యాంగులకు న్యాయసేవ అధికార సంస్థ ద్వారా ఉచితంగా వకీలును పెట్టుకునే హక్కు వారికి ఉంటుందని ఆమె సూచించారు. 1987 ఆర్టికల్39(ఎ) ద్వారా ప్రతిఒక్కరికి న్యా యం పొందే హక్కును కల్పించిందని, ఇది పూర్తి స్థాయి లో అమలు కాకపోవడంతో 1995లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. ఇది పూర్తి స్థాయి లో అమలు కాకపోవడంతో 1955లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు. సమీప మండల, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి జిల్లాలో న్యా య సేవాధికార సంస్థ కార్యాలయం ఉంటుందని, టోల్ ఫ్రీ నెంబర్ 15100 ద్వారా సేవలు అందుబాటులో ఉం టాయన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా దేశ వ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు గ్రామీణ స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం పొందే విధంగా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని జిల్లా అధికారులకు ఆమె సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.