చిట్యాల, అక్టోబర్ 2 : ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ అందిస్తున్న దసరా కానుక మండల కేంద్రంతో పాటు జూకల్, చల్లగరిగె గ్రామాల్లో ఎంపీపీ దావు వినోదా, జడ్పీటీసీ గొర్రె సాగర్, స్పెషల్ ఆఫీసర్ శైలజ పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, ఎంపీడీవో రామయ్య, పీఏసీఎస్ చైర్మన్ క్రాంతికుమార్‌రెడ్డి, డీటీ వేణు, సర్పంచులు పూర్ణ చందర్రావు, పుట్టపాక మహేందర్, కర్రె మంజుల, ఏపీఎం మంజుల, ఎంపీటీసీ కట్కూరి పద్మ, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రాజమహ్మద్ పాల్గొన్నారు.
చిట్యాలలో
చిట్యాల(మొగుళ్ళపల్లి): మండలంలోని పర్లపల్లి, ములకలపల్లి, పిడిసిల్ల, గణేశ్‌పల్లి గ్రామాల్లో చీరెల పంపిణీని ఎంపీపీ యార సుజాత, జడ్పీటీసీ జోరుక సదయ్య, స్పెషల్ ఆఫీసర్ సునీత చేపట్టరు. కార్యక్రమంలో తహసీల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో కృష్ణవేణి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చదవు అన్నారెడ్డి, సర్పంచులు జోరుక ప్రేమలత, ప్రభాకర్‌రెడ్డి, యుగేంధర్, పాల్గొన్నారు.
కాటారంలో..
కాటారం: మండలకేంద్రంలో సర్పంచ్ తోట రాధమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మ య్య, మండల ప్రత్యేకాధికారి అక్బర్, తహసీల్దార్ తిప్పర్తి శ్రీనివాసరావు, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ధన్వాడ గ్రామంలో డీలర్ నెహ్రూనాయక్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు భూపెల్లి రాజు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు డోలి రామక్క, రఘువీర్, ఎంపీటీసీ బాసాని రవి, ఎంపీవో మల్లికార్జున్‌రెడ్డి, వీఆర్వో బండి శ్రీనివాస్, ఇమ్రాన్ పాల్గొన్నారు.
మహాముత్తారంలో..
మహాముత్తారం: మండలంలోని ములుగుపల్లి గ్రామంలో సర్పంచ్ దూలం మల్లయ్యగౌడ్, మినాజీపేటలో సర్పంచ్ ముత్యాల రాజు, మాదారంలో సర్పంచ్ అజీమాబేగం, పెగడపల్లిలో సర్పంచ్ కొర్ర వినోద బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కాళేశ్వరంలో…
కాళేశ్వరం,అక్టోబర్ 2 : మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం, కన్నేపల్లి, పలుగుల, మద్దులపల్లి, అన్నారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు చీరెలు పంపిణీ చేశారు. కాళేశ్వరంలో సర్పంచ్ వసంత,ఎంపీటీసీ మమత, మద్దులపల్లిలో రేషన్ డీలర్ రవి పంపిణీ చేశారు.
మహదేవపూర్‌లో..
మహదేవపూర్, అక్టోబర్ 2 : మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ బన్సోడ రాణిబాయి చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుడాల అరుణ, సర్పంచ్ శ్రీపతిబాపు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్, ఉపసర్పంచ్ సల్మాన్‌ఖాన్, ఎంపీటీసీ సుధాకర్ పాల్గొన్నారు.
మల్హర్‌లో..
మల్హర్: మండలంలోని తాడిచర్ల జీపీలో సర్పంచ్ సుంకరి సత్యనారాయణతో కలసి ఎంపీపీ మలహల్రావు, జడ్పీటీసి ఐత కోమల, మల్లారంలో సర్పంచ్ గొనె పద్మతో కలసి సింగి ల్ విండోచైర్మన్ చేప్యాల రామారావు, రైతుబంధు సమితి మండల ఆధ్యక్షుడు గొనె శ్రీనివాస్‌రావు బతుకమ్మ చీరెలు పంపిణీ చేవారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రకాశ్‌రావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో నరసింహమూర్తి, ఆర్ఐ సరిత, కార్యదర్శలు పాల్గొన్నారు.
పలిమెలలో..
పలిమెల: మండలకేంద్రంలో అర్హులకు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి భాస్కర్, తహసీల్దార్ మాధవి, ఎంపీడీవో ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ పుష్పలత, జడ్పీటీసీ హేమలత, ఎంపీటీసీ కల్యాణి, ఏపీవో రమేశ్, ఆర్ఐ సౌభాగ్యవతి, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, వీఆర్వో లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతి పాల్గొన్నారు.
ఆడబిడ్డల సంబురం
ములుగుటౌన్/తాడ్వాయి: బతుకమ్మ చీరెల పంపిణీ కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఇన్చార్జి అదనపు కలెక్టర్ కే. నాగపద్మజ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి హాజరై పంపిణీ చేశారు. ఆడ బిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. మొదటి చీరెను సమ్మక్క- సారలమ్మకు సమర్పించి తర్వాత పంపిణీ ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, డీడబ్ల్యూవో ప్రేమలత, డీపీఆర్వో ప్రేమలత, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి పాల్గొన్నారు.