హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
బీబీనగర్, అక్టోబర్ 1 : రాబోయే కాలంలో బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణకు మెడికల్ హబ్‌గా మారనున్నదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇక్కడి వైద్య కళాశాల ఆధునిక వైద్య రంగానికి కేంద్ర బిందువుగా కానున్నదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఎయిమ్స్ కాలేజ్ అకాడమిక్ సెషన్‌ను ప్రారంభించారు. కొవిడ్ సమయంలో విశేష సేవలందించిన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఎయిమ్స్ అభివృద్ధిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేసిన కృషిని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
ఎయిమ్స్ వైద కళాశాల ఆధునిక వైద్య రంగంలో కేంద్ర బిందువుగా మారనుందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్ అకాడమిక్ సెషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయ్ స్వస్థ సురక్ష యోజనలో భాగంగా ఎయిమ్స్ వైద్య కళాశాలను ప్రకటించారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి మెరుగైన వైద్యం అందించేందుకు 200 ఎకరాల్లో ఎయి మ్స్ వైద్య కళాశాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో ఎయిమ్స్ తెలంగాణకు ఆణిముత్యంలా నిలుస్తుందన్నారు. దవాఖానలో ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ ఎంఓయూ కుదుర్చుకోవడం అభినందనీయమని తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మూడో బ్యాచ్ వైద్య విద్యార్థుల కోసం ఎయిమ్స్‌లో కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుందన్నారు. కార్య క్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీన్ డాక్టర్ రాహుల్ నారంగ్, రాచకొండ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ప్రొఫెసర్లు, డైరెక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం భువనగిరి మండలం కేసారం గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రం లో ఏర్పాటు చేసిన రవికాంత్ ప్రేమ కాంస్య విగ్రహాన్ని గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు.