చేవెళ్లటౌన్, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ దిక్సూచిగా వ్యవహరించారని ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ యువనాయకుడు పట్లోళ్ల కౌశిక్‌రెడ్డిలతో కలిసి వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో జయశంకర్ సార్ తనదైన ముద్రను వేశారన్నారు. రాష్ట్ర సాధనతో పాటు నవ తెలంగాణ నిర్మాణం కోసం జయశంకర్ పాత్ర కీలకమైందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, సర్పంచ్ శంకర్, చేవెళ్ల నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు రమేశ్వర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, ప్రభాకర్, నాయకులు యాదిరెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సార్ సేవలు చిరస్మరణీయం
ఆమనగల్లు, ఆగస్టు 6 : జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కొనియాడారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సార్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాద్‌నగర్ పట్టణంలో..
షాద్‌నగర్‌టౌన్, ఆగస్టు 6 : షాద్‌నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కోసం జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు జయశంకర్‌సార్ అని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రతాప్‌రెడ్డి, బచ్చలి నర్సింహులు, వెంకట్రాంరెడ్డి, ఈశ్వర్‌రాజు, శ్రీనివాస్, కృష్ణవేణి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహరెడ్డి, నాయకులు యుగేందర్, జూపల్లి శంకర్, యాదగిరి, నందకిశోర్, శ్రీశైలం, ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గంగిరెడ్డి, రమేశ్, పాండురంగారెడ్డి, బాల్‌రాజు, యాదయ్య, రాజ్యలక్ష్మి, విజయ పాల్గొన్నారు.
గ్రంథాలయం ఆవరణలో
ప్రొఫెసర్ జయశంకర్‌సార్ జయంతి సందర్భంగా షాద్‌నగర్ గ్రేడ్-1 గ్రంథాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శేఖర్, మహేశ్వర్, యాదయ్య, జగన్, గోపాల్, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో..
ఇబ్రహీంపట్నం / ఇబ్రహీంపట్నంరూరల్/మంచాల, ఆగస్టు 6 : జయశంకర్ ఆశయాల సాధనకు యువత, విద్యార్థులు కృషిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృపేష్ఆధ్వర్యంలో జయశంకర్‌కు నివాళులర్పించారు. మంచాల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్యల ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, యువజనసంఘాల సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ జాతిపితకు నివాళి
తాండూరు, ఆగస్టు 6 : తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో జయశంకర్‌సార్ విగ్రహానికి నివాళులర్పించారు. తాండూరు పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, టీఆర్ఎస్ నేతలు జయశంకర్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా టీఆర్ఎస్ సర్కార్ పాలన ఉందని పేర్కొన్నారు.