క్రైస్తవులం అని చెప్పుకోవడమే కాదు.. క్రీస్తులా మాట్లాడాలి, క్రీస్తులా ప్రవర్తించాలి, క్రీస్తులా ప్రార్థించుకోవాలి. ప్రభువు ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి సారించాడు. మొదటిది దేవుడ్ని పూజించాలి. రెండోది సాటి మనిషిని ప్రేమించాలి. తోటివారికి సాయపడటంలో ప్రేమ కనబరచాలి. ఈ రెండు అంశాలూ పది ఆజ్ఞల్ని గర్భీకరించుకున్న మహా సూత్రాలు.
‘దేవుడిపై కనబరచే ప్రేమను నీ పక్కనే ఉన్నవానిపై చూపించాలి. దేవుడు ప్రేమమయుడు, కాంతిమంతుడు, సత్య బోధకుడు. ఇవన్నీ కలబోసిన దేవుడ్ని ఆరాధించాలంటే.. ఆయన మనోగతాన్ని ప్రేమించాలి, అభిమానించాలి, ఆచరించాలి. ప్రభువు బాటలో నడిచేవారే నిజమైన క్రైస్తవులు అంటారు మతపెద్దలు.
మానవ బలహీనతలకు , ఉన్న పరిస్థితులకు లొంగిపోయినా, తప్పు తెలుసుకున్నాక పశ్చాత్తాపంతో తిరిగి వాటిని చేయకుండా ఉండాలి. ‘నా దారి ఇరుకైంది, క్లిష్టం’ అని ప్రభువే బోధించాడు. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా.. ప్రభువు బోధలు పాటించాలి. తోటివారిని ప్రేమించడం మానవుల నైతిక బాధ్యత. అది క్రీస్తు పునరుద్ఘాటించిన సత్యం. దానిని క్రీస్తు సందేశంగా స్వీకరించి ప్రవర్తించాలి. అప్పుడే క్రైస్తవత్వం సిద్ధిస్తుంది.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు,
98667 55024