తిరుమల : గుంటూరుకు చెందిన విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య బుధవారం టీటీడీ ( TTD) శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం ( Donations ) గా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.
వైకుంఠ ద్వాదశి సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం

వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో బుధవారం తెల్లవారుజామున స్వామివారి పుష్కరిణి తీర్థ ముక్కోటి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.