Srisailam temple | శ్రీగిరులపై భక్తుల సందడి.. వైభవంగా వెండి రథోత్సవం
శ్రీశైలం : శ్రీగిరులు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. శ్రీశైల భ్రమరాంబికా మల్లికుర్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా కనిపించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, శివస్వాములు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఆలయంలో సాయంత్రం సహస్ర దీపార్చన కనుల పండువలా సాగింది. ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్న దీపాలంకరణ మండపంలో తొలుత స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి ప్రదోషకాలంలో లోక కల్యాణార్థం సంకల్పం పఠించారు. అనంతరం దీపాలను వెలిగించారు. అనంతరం ఆది దంపతులను వెండి రథంపై అధిష్టింప చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మేళతాళాల మధ్య రథోత్సవం వైభవంగా సాగింది.
నందీశ్వరుడికి ప్రత్యేక అర్చనలు

త్రయోదశి సందర్భంగా ఆలయంలోని నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాలంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహా సంకల్పం పఠించి. గణపతిపూజ చేశారు. ఆ తర్వాత వివిధ రకాలు ఫలోదకాలు, ఉదకం, పంచామృతాలు, భస్మంతో నందీశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నాభిషేకం నిర్వహించారు. వృషభ పురుషసూక్త వేదమంత్రాలతో పుష్పార్చన చేసి నానబెట్టిన శెనగలు నైవేద్యంగా సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.
నిత్యాన్నదాన పథకానికి రూ.2లక్షల విరాళం

దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన ప్రభాకర్రావు, గుంటూరుకు చెందిన సాయిధీరజ్ ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున విరాళాలు అందజేశారు. సోమవారం ఆలయ పర్యవేక్షకురాలు సాయికుమారికి విరాళాన్ని చెక్కురూపంలో అందజేశారు. దాతలకు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

