TTD | ఆగస్ట్ 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల చేయనున్నది. ఆగస్ట్ 1న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నది. 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. టికెట్కు రూ.2,500 చెల్లించి బుక్ చేసుకోవచ్చని చెప్పింది. మూడు రోజుల పాటు స్నపన తిరుమంజనం, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆగస్ట్ 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
ఆగస్ట్ 7న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

