TTD | తిరుమల (Tirumala)లో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు (Salakatla Teppotsavam) కనుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం స్వామివారు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి (Rukmini Sri Krishna Swamy) తెప్పపై నుంచి భక్తులను అనుగ్రహించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత పుష్కరిణి (Srivari Pushkarini) వద్దకు తీసుకొచ్చారు.
రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విద్యుద్దీపాలతై అందంగా అలంకరించిన తెప్పపై స్వామి ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లూ విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వేదం, గానం, నాదం మధ్య ప్పోత్సవం వేడుకగా సాగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెప్సోత్సవాలను తిలకించి.. పులకించిపోయారు. ఉత్సవాల్లో మూడో రోజైన ఆదివారం మలయప్పస్వామి తిరుచ్చిపై స్వర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు.