తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 29 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు(TTD Officers) వివరించారు.
కాగా నిన్న స్వామివారిని 74,995 మంది భక్తులు దర్శించుకోగా 39,663 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.60 కోట్లు ఆదాయం(Income) వచ్చిందన్నారు.
వైభవంగా మహా సంప్రోక్షణ
తిరుపతి : తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం మహాసంప్రోక్షణను వైభవంగా నిర్వహించారు. ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు 2021 సెప్టెంబరు 14న ప్రారంభించిన పనులు పూర్తి కాగా ఆలయ అర్చకులు జీర్ణోద్ధరణ, మహాసంప్రోక్షణను ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
గురువారం ఉదయం కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం స్వామివారు పెద్ద శేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.