తిరుమల : శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ( Laddu Prasadams ) పెంచుతున్నట్లు కొందరు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని టీటీడీ చైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చౌకబారు వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఇలాంటి వార్తలు పూర్తి అవాస్తమని, ఆధారాలు లేని వార్తలని ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ లడ్డూ ప్రసాదాల ధరలను పెంచే ఆలోచనేలేదని స్పష్టం చేశారు.