Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Salakatla Brahmotsavam) ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ తొమ్మిదిరోజులు శ్రీవారు ప్రతిరోజూ ఒక్కో వాహనంపై తిరుమల మాఢవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సెప్టెంబర్ 23 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. వచ్చే మంగళవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. 24న ధ్వజారోహన కార్యక్రమం జరుగనుంది. అదేరోజు రాత్రి 9 గంటలకు వేంకటేశుడు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. ఏ రోజు ఏయే వాహన సేవలు ఉంటాయంటే..
సెప్టెంబర్ 24న- సాయంత్రం 05.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ.
సెప్టెంబర్ 25న- ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ.
సెప్టెంబర్ 26న- ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ.
సెప్టెంబర్ 27న- ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహన సేవ.
సెప్టెంబర్ 28న- ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి వరకు గరుడ వాహన సేవ.
సెప్టెంబర్ 29న- ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ.
సెప్టెంబర్ 30న- ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ.
అక్టోబర్ 1న- ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ.
అక్టోబర్ 2న- ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం. దీంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.