తిరుమల : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(Darsan), లడ్డూ(Laddoos) ధరల్లో మార్పు లేదని తిరుమల, తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. దర్శనం, లడ్డూ ధరలు (Price) సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది. భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. అవాస్తవాలు, దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని సూచించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వా్మి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతా నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలోని 31 కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి ఏటీసీ(ATC) వరకు క్యూలైన్లో నిలబడియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం(Sarvadarasan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 72,294 మంది భక్తులు దర్శించుకోగా 31,855 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.39 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.