Lighting Lamp Rules | పూజలో దీపారాధనకూ రూల్స్.. వాటిని పాటిస్తేనే శుభం కలుగుతుంది..!
Lighting Lamp Rules | భారతీయ సంప్రదాయంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దేవుడికి పూజ చేస్తున్నప్పుడు దీపాలు వెలిగిస్తున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
Lighting Lamp Rules | హిందువులు.. ప్రత్యేకించి మహిళలు ఉదయాన్నే లేచి స్నాన పానాదులు ముగించుకుని దేవుడికి పూజలు చేస్తారు. పండుగలు వచ్చినా, ఇంట్లో పెండ్లి, ఇతర శుభకార్యాలు జరిగినా ప్రత్యేక పూజలు తప్పనిసరి. ఈ పూజల్లో దీపారాదనకు ప్రత్యేక స్థానం ఉంది.రోజూ దేవుడికి పూజ చేసినా, పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలు జరిగినా తొలుత దేవుడికి దీపం వెలిగించి, అటుపై మంగళ హారతి పడతారు. దీపం వెలిగించకుండా ఏ పూజ చేసినా అది అసంపూర్ణమేనని అంటారు. దీపం వెలిగించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందే.
దీపం వెలిగించడంలోనూ కొన్ని పద్దతులు పాటించినప్పుడు మాత్రమే తమ పూజకు శుభ ఫలితాలు పొందగలరు. పూజ చేస్తున్నప్పుడు వెలిగించే దీపపు కుందులు పరిశుభ్రం చేసుకోవాలి. దీపం వెలిగించే కుందులు దెబ్బ తినకూడదు. అటువంటి కుందుల్లో దీపం వెలిగించినా, పూజ ముగిసే లోపు దీపం ఆరిపోయినా అపశకునంగా భావిస్తున్నారు. కనుక పూజ ప్రారంభించడానికి ముందే దీపంలో తగిన మోతాదులో నూనె గానీ, నెయ్యి గానీ ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల పూజ ముగిసే లోపు దీపం ఆరిపోకుండా ఉంటది.
పూజ చేస్తున్నప్పుడు పూజ దీపం మినహా ఏ ఇతర దూపం దీపం వెలిగించరాదు. పూజ చేస్తున్నప్పుడు నెయ్యి దీపం వెలిగిస్తే, మరో నూనె దీపం వెలిగించకూడదు. దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవుడి విగ్రహం ముందు ఉంచాల్సి ఉంటుంది. నెయ్యి దీపం వెలిగిస్తే మీకు ఎడమవైపు, నూనె దీపం వెలిగిస్తే మీకు కుడివైపు ఉంచాలి. ఇక ఎప్పుడూ పూజాస్థలంలో దీపాన్ని పడమర దిశలో పెట్టకూడదు. నూనె దీపంలో ఎర్రటి వత్తిని వినియోగించడం శుభప్రదం అని అంటారు. ఇంటి దీపానికి దూది ఉపయోగించవచ్చు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

