సాయంగా రావాలని
జ్యేష్ఠ పౌర్ణమిని కర్షకులు ‘ఏరువాక పున్నమి’గా చేసుకుంటారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అనీ, ఏరువాక అంటే దున్నడానికి వెళ్లడమనీ అర్థం. మొదట్లో దీన్ని ‘ఏరు పోక’ అనేవారు. అదే క్రమంగా ఏరువాకగా మారింది. తొలకరి జల్లులు కురిసి ప్రకృతి అంతా చల్లదనంతో
ఏరువాక పున్నమి ప్రాధాన్యం వివరించండి? – వై.రామకృష్ణ, నిజామాబాద్
జ్యేష్ఠ పౌర్ణమిని కర్షకులు ‘ఏరువాక పున్నమి’గా చేసుకుంటారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అనీ, ఏరువాక అంటే దున్నడానికి వెళ్లడమనీ అర్థం. మొదట్లో దీన్ని ‘ఏరు పోక’ అనేవారు. అదే క్రమంగా ఏరువాకగా మారింది. తొలకరి జల్లులు కురిసి ప్రకృతి అంతా చల్లదనంతో పులకరించే సమయంలో ఈ పండుగ వస్తుంది. మనుషుల మనుగడకు మూలాధారం వ్యవసాయం. సాగుబడిలో సాగిపోయే రైతులు చేసుకునే పండుగ ఇది. జ్యేష్ఠ మాసంతో వానాకాలం మొదలవుతుంది. దాదాపు ఇదే మాసంలో వర్షాలకు అనువైన మృగశిర కార్తె వస్తుంది. ప్రాచీన కాలంలో సేద్యం వర్షాల ఆధారంగానే నడిచేది. అందుకే మృగశిర కార్తె ప్రవేశించగానే, సమృద్ధిగా వానలు కురవాలని దైవాన్ని ప్రార్థించేవారు.
తొలకరి పలకరించగానే, రైతులు ఆనందోత్సాహాల మధ్య దున్నకాలు మొదలుపెడతారు. దీనికిముందు పంట పనుల్లో తమకు చేదోడువాదోడుగా ఉండే పశువులను పూజిస్తారు. భూదేవిని పూజించడంతోపాటు పశువులను, నాగలి, పార, గునపం వంటి పరికరాలను శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఎడ్లను చక్కగా అలంకరించి, వాటి కొమ్ములకు రంగులు అద్దుతారు. పంట పనుల్లో తమకు అండగా నిలవాలని ప్రార్థిస్తారు. పొంగలి వండి వాటికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత రైతులంతా ఉమ్మడిగా పొలంలో దుక్కులు దున్నే కార్యక్రమం చేపడతారు. పండుగ వేళ ఆడపిల్లలను ఇంటికి పిలిచి సారె సమర్పించే సంప్రదాయమూ ఉంది. కొన్నిచోట్ల ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్లకు బండలు కట్టి పోటీలు నిర్వహిస్తారు.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

