ధాన్యం.. వర్షార్పణం
ధాన్యం వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మండలంలోని పాలేపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. నీట మునిగింది. వానలు కురుస్తున్నా ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి సక్రమంగా లారీలు రాకపోవడంతోనే కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నట్టు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
- వానకాలం వచ్చినా ఇంకా పూర్తి కాని ధాన్యం కొనుగోళ్లు
- తడిసి ముద్దయిన పాలేపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం
దోమ, జూన్ 13 : ధాన్యం వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మండలంలోని పాలేపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. నీట మునిగింది. వానలు కురుస్తున్నా ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి సక్రమంగా లారీలు రాకపోవడంతోనే కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నట్టు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. వరి నార్లు చల్లుకు నే సమయం వచ్చినా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముజాహిద్పూర్ కొనుగోలు కేంద్రంలో
కులకచర్ల : మండలంలోని ముజాహిద్పూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం సక్రమంగా సాగకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి వారం రోజులు దాటినా అక్కడి సిబ్బం ది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గత 15 రోజుల కిందట కురిసిన వానకు 500పైగా ధాన్యం బస్తాలు తడిసిపోగా..శుక్రవారం అర్ధరాత్రి పడిన వర్షానికి కేంద్రంలో తూకం కోసం తీసుకొచ్చిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు నేరుగా తమ ధాన్యాన్ని రైస్‌మిల్లుల్లో విక్రయించి బిల్లులు చేయించుకునేందుకు కొనుగోలు కేంద్రానికి వస్తే అక్కడి సిబ్బంది హమాలీ పేరుతో రూ.15 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తూకం నిరీక్షణ
ముజాహిద్‌పూర్‌లోని కొనుగోలు కేంద్రానికి వారం రోజుల కిందట ధాన్యాన్ని తూకం కోసం తీసుకొచ్చా. ఇప్పటికీ తూకం వేయడం లేదు. ధాన్యాన్ని ట్రాక్టర్లో తీసుకురావడంతో దానికి ప్రతిరోజూ కిరాయి చెల్లించాల్సి వస్తున్నది. ఇంకా ఎన్ని రోజులు ట్రాక్టర్ అద్దె చెల్లించాలి. కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వానకు వడ్లు మొత్తం తడిసిపోయాయి. పలుకుబడి ఉన్న వారి ధాన్యా న్ని తూకం వేస్తూ ప్రజలను పట్టించుకోవడంలేదు. -బుగ్గయ్య, రైతు, రాంరెడ్డిపల్లి, కులకచర్ల
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

