తిరుమల : తిరుమల ( Tirumala ) లో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా గత నాలుగు రోజుల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా అలిపిరి మెట్ల వద్ద నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటున్నారు.
బుధవారం రికార్డు స్థాయిలో 86,315 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 44,107 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో 31 కంపార్టుమెంట్లు నిండిపోయి గోగర్భం డ్యాం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల నుంచి 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.94 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.