ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీ చ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి ఇలా వరుసగా తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తారు. ఈ తొమ్మిది అవతారాలూ వేరుకావు. దుర్గాదేవి తొమ్మిది భేదాలే శైలపుత్రి మొదలుగా ఉన్న తొమ్మిది శక్తులు. దుర్గాదేవి నవరూపాలు ధరించడం వెనుక ఉన్న ఆంతర్యం తెలుసుకుంటూ, భక్తిశ్రద్ధలతో యథాశాస్త్రం వ్రతాన్ని ఆచరిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. మొదట భౌతిక సుఖాలు పొంది, కొంతకాలానికి అంతఃకరణ శుద్ధి ఏర్పడి సచ్చిదానంద రూపమైన నిత్యశుద్ధ బుద్ధ స్వభావమైన మోక్షాన్ని అందుకోగలుగుతాం.
శ్రీ ..?