తిరుమల : తిరుమల ( Tirumala ) లో ఆధ్యాత్మిక వనాలను ( Spiritual forests) , ఔషధ వనాలను విరివిగా అభివృద్ధి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమలలో జీఎన్సీ, గీత పార్క్ , నామాల పార్క్ వంటి వివిధ ఉద్యానవనాలను ఆయన బుధవారం పరిశీలించి టీటీడీ ఉద్యానవన, అటవీ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన రానున్న బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని ఉద్యానవనాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న మొక్కలను పెంచేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. టీటీడీ ఫారెస్ట్ విభాగం డిప్యూటీ సీఎఫ్ ఫణి కుమార్ నాయుడు, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.