శ్రీశైలం : కార్తికమాసంలో శివదీక్షా ప్రారంభించిన భక్తులు బుధవారం నుంచి శివదీక్షా శ్రీశైలంలో (Srisailam) విరమణలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం ఈనెల 15న ముగుస్తుందని
ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ దక్షిణద్వారం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగించారు.
అనంతరం హోమగుండానికి అర్చకులు పూజలు నిర్వహించి హోమాగ్నిని వెలిగించారు. జ్యోతిర్ముడి సమర్పణ అనంతరం ఆవునెయ్యి, నారికేళం, తదితర ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పిస్తారని తెలిపారు. శివదీక్ష (Shiva Diksha) విమరణ పూర్తి అయ్యేంతరవకు శిబిరాల్లోని దేవతామూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీక్షా విరమణ చేసే భక్తులు నిర్ణీతవేళలో ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాట్లు కల్పించామని తెలిపారు.