కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్
కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్మాలా విభూషితామ్
ఇది కాళరాత్రి ధ్యానశ్లోకం. రాత్రి కాలానికి అధికారిణిగా నిలిచిన అమ్మవారే.. కాళరాత్రి. ఈమెను మృత్యుదేవతగానూ భావిస్తారు. దేవీ నవరాత్రుల్లో ఏడోరోజు కాళరాత్రిగా అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రపంచానికి వాటిల్లినఉపద్రవం నుంచి మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన దేవిగా భావిస్తారు. నల్లని రంగులో అభయహస్తంతో గార్దభ(గాడిద) వాహనంపై లోకభీకర రూపంలో సాక్షాత్కరించింది కాళరాత్రి. ఆమె వాహనం కూడా కాలమేఘంలా కనిపిస్తుంది.
కాళరాత్రి చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. పై ఎడమ చేతిలో ఒడి తిరిగిన ఖడ్గాన్ని, కింది ఎడమ చేతిలో కంటకాల వంటి కత్తులతో కూడిన మరొక ఆయుధాన్ని ధరించి శత్రు భయంకరిగా నిలిచిన అమ్మవారు, తన కుడి చేతులతో అభయ, వరద ముద్రలను ప్రదర్శిస్తూ భక్తులపాలిట కల్పవృక్షంగా భాసిల్లుతున్నది. గార్దభ వాహనంపై.. కుడికాలును ముడుచుకొని, ఎడమకాలును జారవిడిచి భక్తులపై అనురాగంతో నిండిన చూపులను ప్రసరింపజేస్తూ ఉంటుంది కాళరాత్రి. గ్రహచారంలో శని బాగాలేని వారు, మనోవ్యాధిగ్రస్తులు కాళరాత్రి అమ్మవారిని ఆరాధిస్తే తక్షణ ఫలితం కనిపిస్తుందని చెబుతారు.
నైవేద్యం: శాకాన్నం (వివిధ కాయగూరలతో వండిన కిచిడి)
“దసరాకు ఏ రాష్ట్రం ఎన్ని రోజులు సెలవులు ఇస్తుందో తెలుసా!!”
ముంబై, కోల్కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
dussehra | దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?
దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో వస్త్రంలో ఎందుకు దర్శించుకోవాలి?