‘సాధనాత్ సాధ్యతే సర్వం’ అన్నారు రుషులు. అయితే, ఆ సాధన చేసే విధానం ముఖ్యం. దానిని చేయించే గురువు అంతకన్నా ముఖ్యం. సరైన గురువు అనుగ్రహం లేకపోతే ఏ సాధనా పరిపక్వత చెందదు. శారీరక సమస్యలు, మానసిక దౌర్బల్యాలు, విషయ వాసనలు, చిత్త ప్రవృత్తులు ఇలా ఎన్నో సాధకుణ్ని కకావికలం చేస్తుంటాయి. పక్కదారి పట్టిస్తాయి. వీటిని జయించకుండా సాధన కొనసాగిస్తానంటే కుదరదు.
ఇలాంటి వారికి జన్మాంతర పుణ్యంతో దైవానుగ్రహం లభించినా.. దానిని సద్వినియోగం చేసుకునే నేర్పు కొరవడుతుంది. పసిబాలుడు అడుగులు వేసే క్రమంలో, అరుగులు దిగే సమయంలో పట్టు కోసం తీవ్రంగా ప్రయ త్నం చేస్తాడు. తల్లి చెంతనే ఉంటే.. ఆ పసివాడు పడిపోయే ప్రమాదం ఉండదు. అలాగే సద్గురువు మార్గనిర్దేశంలో కొనసాగిన సాధన పరిపక్వత సాధిస్తుంది. లేకపోతే అపరిపక్వంగానే మిగిలిపోతుంది.
– శ్రీ