2025, మార్చి 1, 2వ తేదీలలో హైదరాబాద్, రవీంద్ర భారతిలోని మొదటి అంతస్తులో ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ-అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భారత్ సంస్థల సంయుక్త నిర్వహణలో జాతీయ సదస్సులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా.. ‘జాతీయ సాహిత్య సదస్సులు’ ‘వారసత్వ దీప్తుల పురస్కారాలు’, ‘ఆ తరం రచయిత్రుల జీవన ప్రస్థానంపై ఈ తరం రచయిత్రుల పత్ర సమర్పణలు’, ‘సాహిత్య పురస్కారాలు’ వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి. పలువురు ప్రముఖులతో పాటు సాహితీవేత్తలు హాజరుకానున్నారు. అందరికీ ఆహ్వానం.