ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, ప్రభుత్వ సిటీ కాలేజీలోని ఆజామ్ హాల్లో ‘సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారం 2025’ ప్రదానోత్సవ సభ జరుగనున్నది. ఈ పురస్కారాన్ని డాక్టర్ నలిమెల భాస్కర్ స్వీకరిస్తారు. ప్రిన్సిపాల్ పి.బాలభాస్కర్ అధ్యక్షతన జరిగే ఈ సభకు ముఖ్య అతిథిగా వెల్దండ నిత్యానందరావు, అతిథులుగా అమర్, యాకూబ్, దేవేందర్ రానున్నారు. డాక్టర్ విప్లవ్ దత్ శుక్లా, డాక్టర్ ఏలూరి యాదయ్య, డాక్టర్ కోయి కోటేశ్వరరావు సభను సమన్వయం చేస్తారు.