తిరుమల : తిరుమలలో నీటి ఎద్దడిని(Water crisis ) అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో (TTD EO ) జె శ్యామలరావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం శనివారం నాటికి కుమారధార, పసుపుధార, ఆకాశగంగ(Akasaganga), గోగర్భ డ్యామ్, పాపనాశం(Papanasam) వద్ద మొత్తం నీటి లభ్యత 4,592 లక్షల గ్యాలన్లు ఉందని వివరించారు.
తిరుపతి , తిరుమల అవసరాల మేరకు నీటిని సరఫరా చేసే కళ్యాణి డ్యాం వద్ద 5,608 లక్షల గ్యాలన్లు నీటి లభ్యత ఉందని పేర్కొన్నారు. డిసెంబర్ 31 వరకు 130 రోజుల వరకు నీరు సరిపోతుందని అన్నారు. తిరుమలలో రోజుకు 42 లక్షల గ్యాలన్ల డిమాండ్ ఉందని, సోమశిల ప్రాజెక్టు ఎస్ఇ, మున్సిపల్ కమిషనర్‌తో ఐదు ఎంఎల్డి (11 లక్షల గ్యాలన్లు) సరఫరా చేసేందుకు అంగీకరించారని తెలిపారు.
కళ్యాణి డ్యాం (Kalyanidam) నుంచి తిరుమలకు రోజూ 25 లక్షల గ్యాలన్ల నీటి సరఫరా వచ్చే రెండు రోజుల నుంచి ప్రారంభం కానుందని పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థకు నీటి సరఫరాను పెంచేందుకు కైలాసగిరి జలాశయం నుంచి అదనంగా పైపులైన్లు వేయడానికి టీటీడీ ట్రస్ట్ బోర్డు రూ. 40 కోట్లు మంజూరు చేసిందని, టీటీడీ అవసరాలకు 10 ఎంఎల్డీలతో పాటు నీటిని కూడా అందించనున్నారని ఈవో వెల్లడించారు. పైప్‌లైన్ పనులను వేగవంతం చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్‌కు టీటీడీ మొదటి విడత రూ. 5.62 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.