తిరుమల : వేసవి సెలవుల కారణంగా తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. స్వామివారి దర్శనానికి 18 నుంచి 24 గంటల పాటు సమయం పడుతుందని టీటీడీ( TTD ) అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం ( Silathoranam ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
సోమవారం 89,399 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 49,985 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.4.92 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 3.88 లక్షల లడ్డుల విక్రయం జరిగిందని వెల్లడించారు.