Maha Shivaratri 2023 | వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు ఎందుకు చెల్లిస్తారు?
Maha Shivaratri 2023 | పరమశివుడు ప్రశాంతత కోసం వచ్చిన నెలవు. సూర్యుడు పునీతుడైన దివ్యక్షేత్రం. శ్రీకృష్ణుడు కోడెమొక్కు చెల్లించిన భవ్యస్థలి వేములవాడ ( Vemulawada ). దక్షిణకాశిగా పేరొందిన వేములవాడ క్షేత్రంలో శివరాత్రి సంబురం అంగరంగ వైభవంగా జరుగుతోంది.
Maha Shivaratri 2023 | పరమశివుడు ప్రశాంతత కోసం వచ్చిన నెలవు. సూర్యుడు పునీతుడైన దివ్యక్షేత్రం. శ్రీకృష్ణుడు కోడెమొక్కు చెల్లించిన భవ్యస్థలి వేములవాడ ( Vemulawada ). దక్షిణకాశిగా పేరొందిన వేములవాడ క్షేత్రంలో శివరాత్రి సంబురం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయ్యవారికి అభిషేకాలు, అమ్మవారికి అర్చనలతో రాజన్న సన్నిధి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతుంది. రాజరాజేశ్వరుడు కొలువుదీరిన వేములవాడ క్షేత్రం శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది.
పురాణాల్లో ‘లేంబాల వాటిక’గా పేర్కొన్న వేములవాడ స్థలపురాణం వినడంతో సర్వ దోషాలూ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. భోగభాగ్యాలకు నిలయమైన సుక్షేత్రాలను వెదుకుతూ పరమశివుడు భూలోకంలో తన నిత్య నివాసానికి వేములవాడను ఎన్నుకున్నాడని పురాణ కథనం. రాజరాజేశ్వరుడిగా శివయ్య కొలువుదీరితే, మహిషాసురుణ్ని ఇదే ప్రాంతంలో సంహరించిన ఆదిశక్తి రాజేశ్వరిగా నిలిచింది. సమస్త దేవతలూ అమ్మవారిని అభిషేకించారట. ఆ పవిత్ర జలంతో సకల తీర్థాల సంగమంగా ‘ధర్మగుండం’ పుష్కరిణి వెలిసింది.
కృష్ణుడు చెల్లించిన మొక్కు
వేములవాడ రాజన్న అనగానే గుర్తుకొచ్చేది కోడె మొక్కులు. యవ్వనంలో ఉన్న కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయని నమ్మకం. ఈ సంప్రదాయానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శ్రీకారం చుట్టాడని స్థల పురాణం. శ్రీకృష్ణుడు, జాంబవతి దంపతులకు రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో సాంబుడనే కొడుకు కలిగాడట. పుత్రుణ్ని వరంగా ప్రసాదించిన రాజన్నకు కోడెను మొక్కుగా చెల్లించుకున్నాడట శ్రీకృష్ణుడు. నేటికీ కోడె మొక్కు సంప్రదాయం కొనసాగుతుండటం విశేషం. పాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి దక్షిణాపథం యాత్రకు వెళ్లినట్లు తెలుస్తున్నది. దీనికి నిదర్శనంగా రాజన్న క్షేత్రంలో సోమేశ్వర, ఉమామహేశ్వర, బాలరాజేశ్వర, భీమేశ్వర తదితర శివలింగాలు పాండవులు ప్రతిష్ఠించినవిగా చెబుతారు.
వైభవంగా జాతర
మహాశివరాత్రి సందర్భంగా మాఘ బహుళ త్రయోదశి నుంచి రాజన్న జాతర మొదలవుతుంది. మూడురోజుల పాటు వైభవంగా జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా సాయంత్రం మహాలింగార్చన ఘనంగా నిర్వహిస్తారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. రాజన్న జాతరకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. 41 రోజులపాటు శివదీక్షలో ఉన్న భక్తులు శివరాత్రి నాడు వేములవాడ క్షేత్రంలో దీక్ష విరమణ చేస్తారు.
…పారువెళ్ల శ్రీనివాస్
Read More :
“Maha Shivaratri 2023 | ఇన్ని క్షేత్రాలు ఉన్నప్పటికీ శివుడికి కాశీ అంటేనే ఎందుకంత ఇష్టం?”
“Maha shivaratri 2023 | సంతాన ప్రాప్తి కోసం శంకరుడిని ఏ పూలతో పూజించాలి?”
“MahaShivaratri Special | మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.”
“Maha Shivaratri | తెలంగాణలోని ఈ క్షేత్రాలు మహాశివరాత్రి వేడుకలకు ఎంతో ఫేమస్ !”
Maha Shivaratri | ఇద్దరు కవుల ముద్దుల శివుడు.. పాలకుర్తి సోమేశ్వరుడి మహాత్మ్యమిదీ..
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

