పూజ చేస్తుండగా పసుపు, కుంకుమలు చేజారితే అరిష్టమా?
రాధిక, కరీంనగర్ పూజ సమయంలో పసుపు, కుంకుమ చేయిజారి నేలపై పడితే అది పొరపాటుగా జరిగిన పని. అంతే. అది ఏదో అశుభాన్ని సూచిస్తుందని అనుకోవలసిన అవసరం లేదు. ఏ వస్తువు చేజారినా ఆ వస్తువు నేలపాలు అవుతుంది. పసుపు కుంకుమలైనా అంతే.
పూజ సమయంలో పసుపు, కుంకుమ చేయిజారి నేలపై పడితే అది పొరపాటుగా జరిగిన పని. అంతే. అది ఏదో అశుభాన్ని సూచిస్తుందని అనుకోవలసిన అవసరం లేదు. ఏ వస్తువు చేజారినా ఆ వస్తువు నేలపాలు అవుతుంది. పసుపు కుంకుమలైనా అంతే. అది దేనికో సంకేతం అనుకోవటం శాస్త్రీయం కాదు. సాధారణంగా ఐదోతనానికి ‘పసుపుకుంకుమల’ను ప్రతీకగా భావిస్తారు.
ఈ కారణంగా అవి చేజారితే అరిష్టమని నమ్మకం ప్రచారంలోకి వచ్చింది. పసుపు, కుంకుమలు చేజారి నేలపై పడటం అరిష్టం కాదు. తిరుమల, విజయవాడ, యాదగిరిగుట్ట తదితర క్షేత్రాల్లో పసుపు, కుంకుమలతో మెట్లను పూజించడం చూస్తుంటాం. దానిని పుణ్యకార్యంగానూ భావిస్తాం. అలాంటప్పుడు పసుపు కుంకుమలు పొరపాటుగా చేజారితే అసంకల్పితంగా భూదేవికి అర్చన చేశామని భావించాలి. అంతేగానీ, అనవసరంగా కలవరపడటం సరికాదు.
-రాధిక, కరీంనగర్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

