Ravana | రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి?
Ravana | రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి | ‘రాక్షసరాజైన రావణుడు మా అన్న. అతను విశ్రవసుని కుమారుడు. మహావీరుడు. మిక్కిలి బలశాలి అన్న సంగతి నీకు తెలిసే ఉండొచ్చు’ అని పంచవటిలో శ్రీరామచంద్రుడితో తనను తాను పరిచయం చేసుకునే సందర్భంగా శూర్పణఖ పలికిన మాటలివి.
Ravana | రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి?
– గాలిపెల్లి నారాయణ. మద్దికుంట
రావణో నామ మే భ్రాతా బలీయాన్ రాక్షసేశ్వరః
వీరో విశ్రవసః పుత్త్రో యదితే శ్రోత్ర మాగతః॥
(శ్రీమద్రామాయణం)
‘రాక్షసరాజైన రావణుడు మా అన్న. అతను విశ్రవసుని కుమారుడు. మహావీరుడు. మిక్కిలి బలశాలి అన్న సంగతి నీకు తెలిసే ఉండొచ్చు’ అని పంచవటిలో శ్రీరామచంద్రుడితో తనను తాను పరిచయం చేసుకునే సందర్భంగా శూర్పణఖ పలికిన మాటలివి. రావణుడు బలవంతుడు, తపశ్శాలి. సనకసనందనాది రుషుల శాప ప్రభావంతో వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులే త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా జన్మించారు. రావణుడికి పది తలలు ఉండటంపై వివిధ రామాయణ గాథల్లో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. విశ్రవసు భార్య కైకసి. దాంపత్య సుఖాన్ని కోరి ఆయన కైకసిని చేరినప్పుడు, అప్పటికి ఆమె పదకొండుసార్లు రుతుమతి అయినట్లుగా తెలుసుకుంటాడు. ఆమె ద్వారా పదకొండు మంది పుత్రులను పొందాలని భావిస్తాడు. కానీ, కైకసి మాత్రం తనకు ఇద్దరు పుత్రులే కావాలంటుంది. తపోనిధి అయిన విశ్రవసు మాట వృథా కాకుండా, పది తలలున్న రావణుడినీ, పదకొండో వాడిగా కుంభకర్ణుడినీ ఇచ్చాడని విచిత్ర రామాయణం కథ.
విష్ణుమూర్తి నరసింహ అవతారంలో తనను సంహరించే సమయంలో ‘అకస్మాత్తుగా పుట్టి, ఇరవై గోళ్లతో నన్నొక్కణ్ని చంపడం కూడా ఓ పౌరుషమేనా’ అని ఆక్షేపించాడట హిరణ్యకశిపుడు. అప్పుడు శ్రీహరి ‘తర్వాత జన్మలో నీకు పది తలలు, ఇరవై చేతులు ప్రసాదించి, మానవుడిగా అవతరించి సంహరిస్తాన’ని అన్నాడన్న కథా ప్రచారంలో ఉంది. అయితే వాల్మీకి రామాయణంలో వీటి ప్రస్తావన లేదు. రావణుడికి కామరూప విద్యతో పది తలలు ఏర్పడ్డాయని కొందరు చెబుతారు. అతను కోరుకున్నప్పుడు పది తలలు, ఇరవై చేతులు వస్తాయి. అయితే, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు… మొత్తం పది ఇంద్రియాలు. వీటిని అదుపులో పెట్టుకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలాన్నిస్తుంది. పది ఇంద్రియాలకు లొంగిపోయినవాడే దశకంఠుడు అని పెద్దలు విశ్లేషిస్తారు.
డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
Read More :
“పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?”
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

