ఎడారి ఓడ ఒంటె.. హనుమంతుడి వాహనం ఎలా అయ్యింది?
ఆంజనేయుడి వాహనం ఒంటె అని పరాశర సంహితలో పేర్కొన్నారు. మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు. సీతాదేవిని వెతుకుతూ పంపా నదీ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నపుడు, సుగ్రీవుడు వాళ్లను చూసి భయపడతాడు
ఎడారి ఓడ ఒంటె.. హనుమంతుడి వాహనం ఎలా అయ్యింది?
– అంబటి సుభాష్, నిజామాబాద్
ఆంజనేయుడి వాహనం ఒంటె అని పరాశర సంహితలో పేర్కొన్నారు. మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు. సీతాదేవిని వెతుకుతూ పంపా నదీ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నపుడు, సుగ్రీవుడు వాళ్లను చూసి భయపడతాడు. ధనుర్బాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకొని రమ్మని హనుమను పంపిస్తాడు.
ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ని కలుసుకున్నది పంపానదీ తీరంలోనే! ఈ ప్రాంతం హనుమకు ఎంతో నచ్చిన ప్రదేశం. ‘పంపాతీర నివాసాయ గంధమాదన వాసినే’ అని స్వామిని కీర్తిస్తారు భక్తులు. అయితే, ఈ నది తీరం వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండటం కోసం, ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని ప్రతీతి. అంతేకాదు, హనుమంతుడి ధ్వజంపైన కూడా ఒంటె గుర్తే ఉంటుంది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్ఠమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెబుతారు.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- camel
- Doubts
- LORD HANUMAN
- Ramayana
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

