మానవ జీవితం సప్తవర్ణ సమన్వితం. ఒక్కో రంగు ఒక్కో భావానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవ చేతనలో ఆలోచనలపై రంగులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.
మానవ జీవితం సప్తవర్ణ సమన్వితం. ఒక్కో రంగు ఒక్కో భావానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవ చేతనలో ఆలోచనలపై రంగులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.ఆ రంగులలో ఉన్న కళాత్మక విన్యాసం మనిషి కలలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
ఎరుపు అన్ని వర్ణాల కన్నా ఎక్కువగా ఉత్తేజాన్నిస్తుంది. ఉత్సాహభరితమైనది ఏదైనా ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు ప్రేమకు చిహ్నం.
నీలం రంగు అన్నిటినీ తనలో కలుపుకొనే తత్త్వం గలది. మన అవగాహనకు మించినది ఏదైనా, సాధారణంగా నీలం రంగులో ఉంటుంది. అది సముద్రం అయినా, ఆకాశం అయినా సరే.
ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తులు నారింజ రంగును ఎంచుకుంటారు. యోగసాధనలో ఆజ్ఞా చక్రం కదులుతున్నప్పుడు, అది నారింజ రంగులో ఉంటుంది. ఈ వర్ణం త్యాగాన్ని సూచిస్తుంది.
శరీరంలో అత్యంత ప్రాథమిక చక్రమైన మూలాధారం వర్ణం పసుపు.
పసుపు-నీలం నుంచి జనించేది ఆకుపచ్చ. హరిత వర్ణం ప్రశాంతమైన మనసుతో స్పష్టతను అందిస్తుంది. పచ్చ.. వృద్ధి, పునరుద్ధరణ, శాంతిని తెలియజేస్తుంది.
తెలుపు నుంచే అన్ని రంగులూ ఉద్భవిస్తాయి. వాన వెలిశాక ఆకాశంలో ఏర్పడే హరివిల్లు పుట్టేది సూర్యుడి తెల్లని కిరణం నుంచే! తెలుపు పవిత్రతను, శాంతిని, స్వచ్ఛతను తెలుపుతుంది.