వేములవాడ కల్చరల్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజామునే భక్తులు స్నానాలు చేసి, రాజన్నకు ప్రీతికరమైన కోడెమొక్కును చెల్లించారు. పలువురు భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో బారులు తీరి, స్వామివారి దర్శనం చేసుకున్నారు.
స్వామివారి దర్శనానికి మూడు నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులు చండీ హోమం, కుంకుమ పూజలు, గండదీపం మొక్కులు, సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు. వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.20లక్షల ఆదాయం సమకూరిందని, ఇవాళ 30వేల మంది వరకు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.