
తిరుమల : తుపాను ప్రభావంతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదుగాలులతో వర్షం కురుస్తుండగా.. పలు చోట్ల చెట్లు విరిగిపడగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తిరుమల రెండు ఘాట్‌రోడ్లను మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.