తిరుమల : శ్రీరామనవమి ( Sri Rama Navami ) ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమల ( Tirumala ) లోనిశ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులకు కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం జరిగింది.

ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల పెద్ద జీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.