తిరుపతి: తిరుమల పరకామణి చోరీ కేసులో (Parakamani Theft Case) టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి ( Dharma Reddy ) బుధవారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. తిరుమల (Tirumala) శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ 2023 ఏప్రిల్ 7న పట్టుబడ్డారు.
అప్పటి టీటీడీ విజిలెన్స్ ఎస్సై సతీశ్ కుమార్ ఫిర్యాదుతో తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే ఏడాది మే 30న రవికుమార్‌పై విజిలెన్స్ అధికారులు చార్జ్‌షీట్ ఫైల్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలతో సీఐడీ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక ఇవ్వాల్సి ఉన్నది.
ఇందులో భాగంగా ధర్మారెడ్డిని విజయవాడ సీఐడీ కార్యాలయంలో సీఐడీ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఎదుట హాజరయ్యారు. నిన్న సాయంత్రం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారునలు సీఐడీ విచారించింది.
చోరీ కేసుపై ఫిర్యాదు చేసిన అప్పటి ఎస్సై సతీష్‌కుమార్ రైల్వే సీఐగా పనిచేస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా తిరుపతికి రైలులో వస్తుండగా అనుమానస్పదంగా రైల్వే ట్రాక్ వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే.