తిరుమల : భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. బుధ, గురువారాల్లో తిరుమలకు వెళ్లే రెండు నడకదారులైన అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొంది. భక్తుల భద్రత దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తిరుమల చేరుకునేందుకు ఘాట్రోడ్డే సురక్షితమని సూచించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.