తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి ( TTD Board ) ఎక్స్ అఫిషియో సభ్యుని( Ex-officio Member ) గా దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు ( Kannababu ) బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం కార్యదర్శి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగ నాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. కె.కన్నబాబుకు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.