Electric bus | టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం
Electric bus | చెన్నైకు చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ వర్థమాన్ జైన్ శనివారం టీటీడీకి ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు.
తిరుమల : చెన్నైకు చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ వర్థమాన్ జైన్ శనివారం టీటీడీకి ( TTD ) ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును (Electric bus ) విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించి, ప్రయాణికులకు ఈ బస్సు చాలా సౌకర్యవంతంగా ఉందని దాతను అభినందించారు. కాగా ఈ బస్సును తిరుమలలోని భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు గా వినియోగించనున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు డి.పి.అనంత, తిరుమల ట్రాన్స్ పోర్ట్ డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Donate
- Electric bus
- Tirumala
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

