తిరుమల : తిరుమలలో (Tirumala) శ్రీవారికి ఇద్దరు భక్తులు విరాళం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వెంకటరమణ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షలు, తిరుపతికి చెందిన సాధు పృథ్వీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షలు సోమవారం విరాళంగా (Donations) అందజేశారు. దాతలు సంబంధిత డీడీలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమల అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 79,705 మంది భక్తులు దర్శించుకోగా 24,836 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల స్వామివారి హుండీకి రూ. 3.67 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని తెలిపారు.