Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కోరిక కోర్కెలు తీర్కే మణికంఠ స్వామిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. రద్దీ కారణగా స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నవంబర్ 17 సోమవారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది అయ్యప్పను దర్శించుకున్నారు. శబరిమలలో ఒక్కసారిగా ఇంత రద్దీ పెరగడానికి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ కారణమని చెబుతున్నారు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు సిబ్బంది చెబుతున్నారు.
ప్రతిఏటా అయ్యప్త భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. ఇరుముడి కట్టి.. కాలినడకన నడుచుకుంటూ వెళ్లి.. చివరకు అయ్యప్పను దర్శించుకోగానే తన్మయం చెందుతారు. ఈసారి పెద్ద మొత్తంలో భక్తులు శబరి తోవ పట్టారు. ఆన్లైన్ స్లాట్‌తో పాటు ఆఫ్లైన్లోనూ టికెట్లు కేటాయిస్తున్నారు. ఫలితంగా రద్దీ పెరుగుతోంది.
தந்தையுடன் பதினெட்டாம் படி ஏறிய 6 மாத பெண் குழந்தை.. ஒவ்வொரு படியாய் ஏற்றிவிட்ட காவலர்கள்!
#Sabarimala #child #ThanthiTV pic.twitter.com/TSYqMaJVyk— Thanthi TV (@ThanthiTV) November 17, 2025
మంగళవారం ఆన్లైన్ స్లాట్‌లో 70 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఆఫ్లైలోన్ మరో 25వేల మందికి టికెట్లు ఇచ్చారు. నీలక్కల్., పంపాబేస్, శబరిమల సన్నిధానం అయ్యప్పమాలధారులతో కిక్కిరిసి ఉన్నాయి. భక్తులు గంటల తరబడి క్యూలైన్ల అన్నపానీయాలు లేకుండా వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం శబరిమలలో 2లక్షల మందికి పైగా భక్తులు ఉన్నట్టు సమాచారం.