శ్రీశైలంలో మహా శివరాత్రి దర్శన వేళల్లో మార్పు
Maha Shivratri | శ్రీశైల మహాక్షేత్రంలో జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ రోజుల్లో ఆలయ దర్శన విధానాలో పలు మార్పులు చేసినట్లు ఈవో లవన్న వెల్లడించారు.
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ రోజుల్లో ఆలయ దర్శన విధానాలో పలు మార్పులు చేసినట్లు ఈవో లవన్న వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. 15 వరకు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు నిర్ణీత సమయాల్లో మాత్రమే స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే మధ్యాహ్నం సమయంలో జరుగుతున్న ఉచిత దర్శనాలు సైతం బ్రహ్మోత్సవాల ముందు రోజు వరకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా శివదీక్షా స్వాములకు చంద్రావతి కల్యాణ మండపంలో, శివదీక్షా శిబిరాల వద్ద నిత్యాన్నదానంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.
మండల దీక్షలు చేసుకుని స్వామిఅమ్మవార్ల దర్శనాలు పూర్తయిన తరువాత జ్యోతిర్ముడి సమర్పణ కోసం శివదీక్షా శిబిరాల వద్ద అర్చక పండితులచే శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి బ్రహోత్సవాలకు వచ్చే శివస్వాములతోపాటు యాత్రికులు కూడా దర్శన సమయాలను పాటిస్తూ క్యూలైన్ల వద్ద ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో లవన్న, ధర్మకర్తల మండలి చైర్మెన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి కోరుతున్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

