తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల (Srivari Salakatla) , నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ( Navaratri Brahmotsavams ) సంబంధించిన 2026 సంవత్సర బుక్లెట్ ( Booklet ) ను టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు ( BR Naidu ) ఆవిష్కరించారు. బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహించే వివిధ వాహన సేవలు, విశేష ఉత్సవాలు, ముఖ్య కార్యక్రమాల వివరాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి బుక్లెట్ను రూపొందించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. ఎ. శరత్, గోపీనాథ్, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణతో పాటు, అధికారులు పాల్గొన్నారు.