పనిలో విజయం లభించినప్పడు ‘అంతా నా నిర్వాకమే’ అని పొంగిపోవద్దు. ‘దేవుడి దయ’ అని కృతజ్ఞతతో ఉండాలి. పని సఫలం కాకపోతే, అది పనితీరు అనుకోక.. కార్యాల జయాపజయాలు మానవ ప్రయత్నంతో కాకుండా దైవానుగ్రహంతో లభిస్తాయని గ్రహించాలి.
గెలుపోటములు విధివిలాసం. అంతేకానీ, సంక్పల్ప శక్తో, అది లేకపోవడమో కాదు! అన్ని వేళలా సమతాబుద్ధిని సాధించడమే నిజమైన సంకల్పసిద్ధి. సాధకుడు తోటివారి ఆదరణకు పాత్రుడు అవుతూ ప్రపంచంలో ఉండాలి. ఇతరుల అసూయాద్వేషాలకు కాదు!
– భగవాన్ రమణ మహర్షి