అరుణగిరి అచంచలం. ఆ అచలంపై నడయాడిన రమణ మహర్షిదీ దాదాపూ అదే తత్వం. అందుకే, ఎక్కడ చోటు దొరక్క మౌనం ఆ మహనీయుడిని ఆశ్రయించింది. ఆ మౌనానికి ఊరడింపు కోసమో ఏమో ఆయన ఎప్పుడోగానీ మాట్లాడేవారు కాదు.
రమణ మహర్షి దగ్గరికి ఓ విదేశీ పాత్రికేయుడు వచ్చాడు. ఏండ్లుగా అలా ఒకే చోట ఉంటున్న రమణుల్ని ఉద్దేశించి ‘అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది ఎలా సమర్థనీయం. ఈ వైఖరితో మీరు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?