సర్వ జనాకర్షణకు …

క్లీం కృష్ణాయ నమః
శ్రీవత్సాంకం మెరస్కం వనమాలా విరాజితమ్
శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
‘కృష్ణ’ శబ్దానికి ‘నలుపు’ అని బాహ్యార్థం. సర్వం కరోతీతి కృష్ణః అన్నిటినీ చేసేవాడు కృష్ణుడు. దైత్యులను నలిపి వేసేవాడు. శ్రీకృష్ణుడు అందరినీ ఆకర్షించేవాడు. విశ్వరూపుడు. విష్ణు వ్యాపనం కలిగినవాడు, సర్వాంతర్యామి.
ఈ విశ్వంలో ఉన్నది ఆకర్షణ శక్తి మాత్రమే. దీనివల్లే కోటాను కోట్ల నక్షత్రాల గమనం ఉంది. ఆయా నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలన్నీ ఆకర్షణలవల్లనే సంచరిస్తున్నాయి. వాటిచుట్టూ ఉపగ్రహాలూ అంతే. నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల్లోనూ ఆకర్షణ శక్తి ఉండటం వల్ల వాటిచుట్టూ పదార్థం ఏర్పడుతున్నది. ఆకర్షణ అనేది ప్రకృతిలో సహజంగా ఉన్నదే. అటువంటి ఆకర్షణలవల్లనే జీవులలో, స్త్రీ-పురుషుల మధ్యలో స్నేహం, ప్రేమ, వాత్సల్యం ఏర్పడుతున్నాయి. సంతానం కూడా ఆకర్షణవల్లనే కలుగుతున్నది. సృష్టి అంతా ఆకర్షణ పరిధిలోనిది. అదే కృష్ణరూపంలోని ‘చైతన్యం’.
పూర్ణ చైతన్యం, శక్తి, ఆకర్షణ మనలోనూ పుష్టిగా ఉండాల్సిందే. మనం అర్థం చేసుకోలేని ఆకర్షణ ‘కృష్ణ చైతన్యం’లో ఉంది. దానివల్లే జీవితంలోని సకలార్థాలనూ మనం సాధించగలం. అందుకే, నిరంతరం ‘క్లీం కృష్ణాయ నమః’ అనే జపం చేద్దాం. సర్వజీవ, ప్రకృతి, జనాకర్షణలు సాధించే అవకాశం దీనివల్లే సాధ్యం. ఈ నిరంతర జపసాధన ద్వారా సాధించలేనిదేమీ ఉండదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక జీవితాలన్నిటిలోనూ అత్యున్నతి స్థితిని పొందే అత్యుత్తమ మంత్రమిది. ఈ జపాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో కొనసాగించే ప్రయత్నం చేద్దాం.

ఇవి కూడా చదవండి..
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

